Friday, August 31, 2007

నేను

నా కళ్ళెప్పుడు తెరిచినా కనిపించేది నీ రూపమే
నా పెదవులెప్పుడు కదిలినా పలికెది నీ నామమే
ఈ హృదయాన్నెప్పుడు మీటినా మ్రోగెది నీ అనురాగ గీతమే
నా కాళ్ళు ఎలా నడిచినా చేరుకునేది నీ గమ్యమే
ఈ జీవితం ఎన్ని మలుపులు తిరిగినా చివరకు చేరుకునేది నీ సాన్నిత్యమే
ఈ బ్రతుకు ముగింపు ఎలా వున్నా ముగిసెది నీ సమక్షంలోనే

నీ అప్పు

నీ జ్ఞాపకం

నీ జ్ఞాపకాల జోలల్లోనే కంటిమీదకు కునుకోచ్చేది
నీ జ్ఞాపకాల సుప్రభాతాలతోనే సూర్యోదయాలు తెలిసోచ్చెది
నీ జ్ఞాపకాల సన్నిదిలోనే మది సంతోష సాగరమయ్యేది
నీ జ్ఞాపకాల బాహువుల్లోనే మది బందిగా మిగిలేది
నీ జ్ఞాపకాల మధురిమల్లోనే మది సరిగమలు పాడేది
నీ జ్ఞాపకాల వెన్నేల్లోనే ఎద స్నానాలు చేసేది
నీ జ్ఞాపకాల నీడల్లోనే మది సేద తేరేది
నీ జ్ఞాపకాల తోడులోనే జీవితం హయిగా సాగిపోయేది

నీ అప్పు

నీ రూపం

పసిపాపలా ముద్దోచ్చే నీ రూపాన్ని
నా కనురెప్పమాటున దాచుకున్నాను
అల్లంత దూరాన వున్నా
ఆశల కిరణమై నను
తాకుతూనే వున్నావు
నిరంతరం నిను చూడాలని
నీతో మాట్లాడాలని
నా మనసు అల్లరి చేస్తుంది

నీ అందం

గులాబీల ఎర్రదం నీ పెదాలలో దాగుంది
తుంటరి తుమ్మెద లానే నిను తాకాలని వుంది
మయురాల నడక కోకిల పాట నిండుగా నీలో వున్నాయి
మృధుమధురమైన నీ మాటలు నే వినాలని వుంది

Monday, August 27, 2007

నా మనసు

నీ పలుకు పాటై నా గుండెను మీటుతుంది
నీ పలుకు పాటై నా గుండెను మీటుతుంది
నీ నవ్వు మలయమారుతమై నను తాకుతుంది
నా మనసు మమతల పందిరై నీడనిస్తుంది
స్వఛ్చమైన నీప్రేమ నాకు వేల వసంతాల బ్రతుకునిస్తుంది

ప్రియ

గులాబీల ఎర్రదనం నీ పెదవులలో దాగుంది
తుంటరి తుమ్మెద లానే నిను తాకాలని వుంది
మయురాల నడక కోకిల పాట నిండుగా నీలో వున్నాయి
మృధు మధురమైన నీ మాటలు నే వినాలని వుంది

నీ అందం

నీ రాకలో ఎన్నో శశిరేఖలు
నీ కన్నులలో కమనీయ కాంతులు
నీ హొయల్లో మదినిండా మదురిమలు
నీ పలుకుల్లో జాలువారు తేనియలు
నీ ఒంపుల్లో నయగారా సొంపులు

Wednesday, August 8, 2007

నా కోరిక

నీ అందమైన చూపుల గాలానికి బందినైపోవాలని
నీ చల్లని మనసులో వెచ్చగా తల దాచుకోవాలనీ
అలసిన నేను నీ హృదయ సన్నిదిలో సేద తీరాలనీ
నీ అంతరంగ కోవెల్లో కొలువు ఏర్పరచుకొవాలనీ
నీ కనుపాపలో నేను ప్రతిబింబమై నిలిచిపోవాలనీ
నీవు పఠించే పుస్తకం లో ప్రతి అక్షరం నేనై పోవాలనీ
కుసుమ సౌరభాలై నీ మనసును అహ్లదపరచాలని వుంది

ప్రియతమ నా హృదయమా


మౌనం కరిగి పెదాల పువ్వులపై
మాటల మంచి ముత్యాలై మెరుస్తుంటే
చూపులు నిలిచి మనసనే సరస్సు లో
కలువలై కదులుతుంటే
తెలిసి తెలిసి ప్రతిసారి
నన్ను నేను పోగొట్టుకుంటాను
నీలో నన్ను వెదుక్కొవాలన్న ఆశతో
నీ అప్పు

Tuesday, August 7, 2007



నీ చిరునవ్వనే చిరుజల్లుతో

నా హృదయ తాపాన్ని

చల్లార్చుతావని

నిరంతరం నీ నామాన్నే

జపిస్తున్నా

ఇన్నాళ్లాకి ఈనాటికి

కలలే నిజమైన వేళ

వెలిగిందోక దీపం

అపూరూపంగా నీ రూపమై

నీ అప్పు

ప్రియతమ

ఒంటరిగా సాగే నా జీవన పయనం లో మరుమల్లెలు పూయించావు
ఎడారి లాంటి నా గమనం లో తోడుగా నిలుస్తావని దిక్కంటులేని నా గమ్యానికి దిక్కువైనావు
నీ లాలనకు మైమరచిపోయిన నా మనసు ఎగసిపడే కెరటలలో తానో కెరటమై
తుంటరి తుమ్మెదల్లో తానో తుమ్మెదై వుంది

నీ అప్పు

నా ప్రేమ

నీ భావనా విహంగానికి నా కనురెప్పలే రెక్కలన్నావు
నా ఆలోచనా తరంగానికి నా చిరునవ్వులే మువ్వలన్నావు
నీ జీవన కధనంలో పల్లవించే మాధుర్యాలే నీ పదాలన్నావు
నీ బాధల అగాధల్లో కధలడే నీడలే నా కన్నీళ్ళన్నావు
అందుకే నన్నో గీతంగా నిలిపావు అనుభవాలను కూర్చి కవితగా మలిచావు

నీ అప్పు