Tuesday, November 27, 2007

ప్రకృతి లో నీవు

గండు తుమ్మెద మకరందాన్నే ఆస్వాదిస్తుంది

కోకిల మామిడి చిగుళ్ళు తినే గానం చేస్తుంది

పురివిప్పి నాట్యమాడే నెమలి కూడ

చిరుజల్లుకే స్వాగతం పలుకుతుంది

నిరంతరం నీ పేరే జపించే

నా హృదయం మాత్రం

ప్రతిక్షణం నీకోసమే అన్వేషిస్తుంది

ఎవరవు నీవు


కన్నులతో కబుర్లు చెబుతావు

చెక్కిలితో సైగలు చేస్తావు

మది లోని ఆమాటని

ఊహకందని ఆ భావాన్ని

అర్ధం చేసుకోవటానికి

ఏ భాష నేర్చుకోమాంటావు

ఏ లిపిని వాడమంటావు

ఎవరవు నీవు


ఏ కోవెల్లో దేవతవో

నను ఇలా చేరుకున్నావు

ఏ మాటల్లో మంత్రనీవో

నను మాయ చేసావు

నా తలపుల్లో వలపువై
గిలిగింతలు పెడతావు

నిన్ను చేరే సమయంలో

చంద్రికవై వెళతావు