Saturday, September 15, 2007

ప్రేమతో


ప్రియమైన నీకు

నీ లేత అధరాల మద్య వికసించిన నవ్వులు విరజాజి పూలై నా హృదయం పై రాలాయి. నీ నవ్వులోని పరిమళాలను ఆస్వాదిస్తూ నీ రాక చూసి నా కంటి కోలను లో కన్నిటి కలువలు విరబూసాయి ఆనందబాష్పాలై.

నా స్నేహమా నిన్న నేను నీ చెంత వున్నానన్న అనుభూతి కన్నా నేడు దూరం అవుతావనే ఆలోచన నన్ను భయపెడుతుంది. నా ప్రాణామా ఉహల్లో కాకపోయిన కలలోనైనా కంపించు. నా చిన్ని హృదయాన్ని బ్రతికించు. ఆశతో ఎదురుచూస్తూ....

నీ

అప్పు

Thursday, September 13, 2007

ప్రేమలేఖ


నీకు గుర్తుందా! ఓ అందమైన సాయంత్రం నిన్ను చూసాను. నీవు కూడా నన్ను చూసావు. కాని నాకింకా జ్ఞాపకం వుంది.

నీ చిరునవ్వు విచిరి నా గుండె చప్పుడు అపేసావు. ఒక్క చూపుతో నన్ను దోచుకున్నావు. అనాటి నుండి నాకు నిదురలేదు. కాని ఇప్పుడు నీకు నాకు గుప్పెడంత గుండెలో ఆకాశమంత ఏకాంతం. అయినా సరే నిన్ను మరిచేదేలా. జీవితాంతం తోడుగా నీడగా లేకపోయినా ఎప్పుడు నీ గురించే నా ఆలోచన. ఆలోచనలైనా నా తోడుగా వుండనీ. నా ఆలోచన నుండి కూడ నువ్వు దూరమైతే ఈ జీవితం ఎలా గడపాలో చెప్పు.

నా ప్రేమలేఖ


ప్రియమైన నీకు

మన పరిచయం నాకు దేవుడిచ్చిన వరం. మన స్నేహపు రోజులు ఎంతో సంతోషంగా గడిచిపోయాయి.అప్పుడు నాకు నా మనసు లోకి ఏదో చేరినట్టు అనిపించేది. నీతో స్నేహం తర్వాత నాకు రోజులు గుర్తుండేవి కావు. నీతో మాట్లాడినపుడు, నీతో గొడవ పడినపుడు చాలా సంతోషంగా వుండేది.

నేను ఏ విషయాన్ని అయీనా తేలిగ్గా తేసుకునేవాణ్ణి. నీ స్నేహం నా మనసు ని హత్తుకుని ప్రేమను పుట్టించింది. మనిషి కి మనసులో నిజమైన ప్రేమ ఒక్కసారే పుడుతుంది. ఆ ప్రేమే నాకు ఆక్షణం నుండి మొదలైంది. ఇన్ని రోజులు నీతో చెప్పలేక మనసులో దాచుకోలేక ప్రేమ అనే తియ్యని బాధ తో మూగబోయాను. నీ ప్రేమ నాకు ఎప్పటికైనా దోరుకుతుందనే నా చిన్ని ఆశతో........

నీ

అప్పు

Friday, September 7, 2007

చెలి

పిలవలేదు నిన్ను రమ్మని నా జీవితం లోకి అడగలేదు మనసిమ్మని నిన్ను నాకు. అగాధమైన నా జీవితం లో ఆశలా వచ్చావు.రెండక్షరాల ప్రేమను వెలిగించావు.

ఆనాటి నుండి నిను చూడని ప్రతిక్షణం ఒక యుగం అనిపిస్తుంది. అలాగే నిన్ను చూస్తూన్న ప్రతిక్షణం ఒక యుగం కావాలనిపిస్తుంది.నా కనులు నన్ను మరిచి నీ జాడను వెతకసాగాయి. నే మాట్లాడే ప్రతి మాట నీ గురించే. నా చేతులు రాసే ప్రతి పదం నీ గురించే.ఇన్ని చేసి ఉషొదయ సూర్యునిలా నాజీవితంలోకి వచ్చి సంద్యోదయం లా తిరిగివెళ్తావా చెలి. నీవు వెళ్ళిపోతే దేవత లేని గుడిలా నా గుండె ఒంటరిదవుతుంది. నీ రాక కోసం ఎదురూచూస్తూ.....


నీ

అప్పు

ప్రియమైన నీకు

ప్రియమైన నీకు

నిను చూచిన క్షణం నుండి నాలో ఏదో తెలియని అనూభూతి. నన్ను మంత్రముగ్దుడిని చేసిన నీ దరహసం చిందించే నీ మోము ను పదే పదే చూడాలన్నదే నా మది తపన.
ఇంతవరకు ఎరుగని ఆలోచన అలజడి ఎలాగైనా నీతో మాట్లాడాలని నిను చూసిన మరుక్షణం నాలో మొదలైంది. అనుకోకుండా జరిగిన మన పరిచయం స్నేహాంగా మారింది. నీతో మాట్లాడుతూ వుంటే ఏదో తెలియని ఉత్సాహం. నా జీవితం లో నీ స్నేహం మరిచిపోలేని ఒక మైలురాయి.
నీతో పరిచయం కలిగి ఏడాది కావస్తుంది. వెనుకకు తిరిగి చూస్తే కాలం యింత తోందరిగా అవుతూన్నదేమిటి అనిపిస్తుంది. కాని నీకు తెలియనిది ఒక్కటే. ఇప్పూడే కాదు ఎప్పటికి నీ రూపం నీ జ్ఞాపకాలు నీ స్నేహం నా మనసు లో చెరిగిపోవు. నా మదిలోని భావాలన్ని నీతో చెప్పాలనిపిస్తుంది. కాని గుండె గది లోంచి మాటలు రావటం లేదు.ప్రేమ తో నీకోసం ఎదురుచూస్తూ....

నీ

అప్పు

Wednesday, September 5, 2007

ప్రియమైన నీకు

ప్రియమైన నీకు



నిను చూచిన క్షణం నుండి నాలో ఏదో తెలియని అనుభూతి. నన్ను మంత్ర ముగ్దుడిని చేసిన నీ దరహసం చిందించే నీ మోము ను పదే పదే చూడాలన్నదే నా మది తపన.

ఇంతవరకు ఎరుగని ఆలోచన అలజడి ఎలాగైనా నీతో మాట్లాడాని నిను చూసిన మరుక్షణం నాలో మొదలైంది. అనుకోకుండ జరిగిన మన పరిచయం స్నేహంగా మారింది. నీతో మాట్లాడుతూవుంటే ఏదోతెలియని ఉత్సాహం. నాజీవితం లో నీ స్నేహం మరిచిపోలేని ఒక మైలురాయి.

నీతో పరిచయం కలిగి ఏడాది కావస్తుంది. వెనుకకు తిరిగి చూస్తే కాలం ఇంత తొందరగా అవుతునాదేమిటి అనిపిస్తుంది. కాని నీకు తెలియనిది ఒక్కటే.ఇప్పుడే కాదు ఎప్పటికి నీ రుపం నీ జ్ఞాపకం నీ స్నేహం నా మనసు లో చెరిగిపోవు. నా మదిలోని భావాలన్ని నీతో చెప్పాలనిపిస్తుంది. కాని గుండె గది లోంచి మాటలు రావటం లేదు. ఆర్ధం చేసుకుంటావని ఆశిస్తూ......


నీ


అప్పు