Friday, September 7, 2007

చెలి

పిలవలేదు నిన్ను రమ్మని నా జీవితం లోకి అడగలేదు మనసిమ్మని నిన్ను నాకు. అగాధమైన నా జీవితం లో ఆశలా వచ్చావు.రెండక్షరాల ప్రేమను వెలిగించావు.

ఆనాటి నుండి నిను చూడని ప్రతిక్షణం ఒక యుగం అనిపిస్తుంది. అలాగే నిన్ను చూస్తూన్న ప్రతిక్షణం ఒక యుగం కావాలనిపిస్తుంది.నా కనులు నన్ను మరిచి నీ జాడను వెతకసాగాయి. నే మాట్లాడే ప్రతి మాట నీ గురించే. నా చేతులు రాసే ప్రతి పదం నీ గురించే.ఇన్ని చేసి ఉషొదయ సూర్యునిలా నాజీవితంలోకి వచ్చి సంద్యోదయం లా తిరిగివెళ్తావా చెలి. నీవు వెళ్ళిపోతే దేవత లేని గుడిలా నా గుండె ఒంటరిదవుతుంది. నీ రాక కోసం ఎదురూచూస్తూ.....


నీ

అప్పు

No comments: