ప్రియమైన నీకు
నిను చూచిన క్షణం నుండి నాలో ఏదో తెలియని అనుభూతి. నన్ను మంత్ర ముగ్దుడిని చేసిన నీ దరహసం చిందించే నీ మోము ను పదే పదే చూడాలన్నదే నా మది తపన.
ఇంతవరకు ఎరుగని ఆలోచన అలజడి ఎలాగైనా నీతో మాట్లాడాని నిను చూసిన మరుక్షణం నాలో మొదలైంది. అనుకోకుండ జరిగిన మన పరిచయం స్నేహంగా మారింది. నీతో మాట్లాడుతూవుంటే ఏదోతెలియని ఉత్సాహం. నాజీవితం లో నీ స్నేహం మరిచిపోలేని ఒక మైలురాయి.
నీతో పరిచయం కలిగి ఏడాది కావస్తుంది. వెనుకకు తిరిగి చూస్తే కాలం ఇంత తొందరగా అవుతునాదేమిటి అనిపిస్తుంది. కాని నీకు తెలియనిది ఒక్కటే.ఇప్పుడే కాదు ఎప్పటికి నీ రుపం నీ జ్ఞాపకం నీ స్నేహం నా మనసు లో చెరిగిపోవు. నా మదిలోని భావాలన్ని నీతో చెప్పాలనిపిస్తుంది. కాని గుండె గది లోంచి మాటలు రావటం లేదు. ఆర్ధం చేసుకుంటావని ఆశిస్తూ......
నీ
అప్పు
2 comments:
అన్నీ చాలా బాగున్నాయండి.
అన్నీ చాలా బాగున్నాయండి.
Post a Comment